నరసింహకొండ ఆలయంలో యువజంట అసభ్యకర చేష్టలు

AP: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పవిత్ర వేదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొందరు యువతీ యువకులు అభ్యంతరకరమైన వీడియోలు చిత్రీకరిస్తూ భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఓ యువజంట సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలోనూ కొండపై మద్యం సేవిస్తూ వీడియోలు తీసిన ఘటనలున్నాయి. కాగా, ఆ యువజంట తమ తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరుతూ పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్