AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద భక్తులకు విద్యుత్ షాక్ తగలడంతో కలకలం రేగింది. ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఆలయ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ప్రసాద పంపిణీని తాత్కాలికంగా ఆపేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టి, మరమ్మతులు నిర్వహించిన అనంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు.