ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణం ఇదే: ధర్మాన

AP: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సుదీర్ఘ రాజకీయ విరామం తర్వాత తిరిగి క్రియాశీలకంగా మారారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో.. వైసీపీ ఓటమికి దారితీసిన కారణాలను వెల్లడించారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం వల్లే వైసీపీ ఓడిపోయిందని చెప్పారు. అధికారం కోల్పోయినప్పుడు ప్రజలకు కొత్త ప్రభుత్వాన్ని అంచనా వేయడానికి సమయం ఇవ్వాలని, కాంగ్రెస్ హయాం నుంచే తనకు ఉన్న అలవాటని ఆయన తెలిపారు. ఎన్నికల సమయానికి సంస్కరణల ఫలితాలు ప్రజల్లోకి పూర్తిగా చేరలేదని, టీడీపీ చేసిన అవినీతి, అరాచక పార్టీ ఆరోపణలు దుష్ప్రచారమని ఆయన కొట్టిపారేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕