వైఎస్ జగన్ సంచలన డిమాండ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించి జగన్ మాట్లాడుతూ.. ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో బుధవారం ధర్నా చేస్తామన్నారు. ఇక్కడి పరిస్థితులను ప్రధాని మోడీకి వివరిస్తామన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని జగన్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయన్నారు.

సంబంధిత పోస్ట్