AP: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో గురుకుల పాఠశాలలో డయేరియా కలకలం రేగింది. ఒక్కసారిగా నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే కురుపాం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పాఠశాలలో ఆందోళన నెలకొంది.