AP: శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను వైసీపీ అధినేత జగన్ పక్కన పెట్టారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్ను నియమించారు. బెల్లాన చంద్రశేఖర్, బొత్స సత్యనారాయణకు మధ్య ఉన్న రాజకీయ ఆధిపత్య పోరాటం జిల్లా అంతటా తెలుసు. ఇప్పుడు ఆయనకే జగన్ పీఠం అప్పగించారు. దాంతో బొత్సను జగన్ సైడ్ చేసినట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది.