అమరావతికి డీజిల్‌ తరలింపు: వైవీసుబ్బారెడ్డి

అమరావతికి డీజిల్‌ను తరలిస్తున్నారని, అందుకే ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరత ఏర్పడిందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, 99 పైసలకే భూములను పరిశ్రమలకు కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. తాము అదానీ, గూగుల్‌ వంటి సంస్థలకు భూములు కేటాయించామని, కూటమి హయాంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్