AP: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ–జనసేన కూటమి నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమవరం నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు, వర్గ విభేదాలు కూటమికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఇరు పార్టీల మధ్య సమన్వయం పెంచేందుకు త్వరలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.