ఏపీలో మరో రెండు రోజుల పాటు భిన్న వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, పోలవరం, కాకినాడ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరవచ్చని అంచనా. మరికొన్ని చోట్ల 43-44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు, దక్షిణ ఏపీలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.