వాలంటీర్ల కొన‌సాగింపుపై డైల‌మా..!

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొన‌సాగింపుపైన డైల‌మా కొన‌సాగుతోంది.ఈ వ్య‌వ‌స్థ‌ను ప్రక్షాళన చేసే దిశగా సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని స‌మాచారం. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే గత రెండు నెలలుగా వాలంటీర్ల కొనసాగింపుపై అనుమానాలు కొన‌సాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌కు కొత్త రూపం తేవాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో కీలక ప్రకటనకు సీఎం సిద్దమవుతున్నారని పార్టీ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది.

సంబంధిత పోస్ట్