దుర్గాదేవి ఊరేగింపులో అపశ్రుతి

AP: విశాఖపట్నం జిల్లా, వలందపేటలో దుర్గాదేవి ఊరేగింపు సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఊరేగింపులో భాగంగా బాణసంచా కాలుస్తుండగా ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. గాయపడిన చిన్నారులను వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕