ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు. సీఎం చంద్రబాబు నాగబాబును కేబినెట్లోకి తీసుకోబోతున్నట్లు నోట్ విడుదల చేసినా, అనంతరం ఎమ్మెల్సీ చేసినా మంత్రి పదవి దక్కలేదు. దీంతో పవన్ కళ్యాణ్ తన పర్యావరణశాఖ పరిధిలోని ఏపీ గ్రీన్ కు ఛైర్మన్ గా కేబినెట్ హోదాతో, నెలకు 4.5 లక్షల జీతంతో నాగబాబును నియమించారు. అయితే, చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారు లాభదాయక పదవుల్లో ఉండకూడదనే రాజ్యాంగ నిబంధన (ఆర్టికల్ 191(1)) ప్రకారం ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దీనిపై చర్చ జరుగుతోంది.