రాజానగరం టీడీపీలో అసంతృప్తి సెగలు?

AP: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో అధికార టీడీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. రుడా ఛైర్మన్‌గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బొడ్డు వెంకటరమణ చౌదరి పనితీరుపై టీడీపీ వర్గాల నుంచే విమర్శలు వస్తున్నాయి. అనుమతుల జాప్యం, అధికారుల అవినీతి ఆరోపణలు, పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించడంలో వైఫల్యం వంటి కారణాలతో కార్యకర్తలు, నాయకులు వైసీపీలో చేరుతున్నారని పరిశీలకులు అంటున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు టీడీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕