ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త అందించింది. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించగా, 15,941 మంది ఎంపికయ్యారు. వీరిలో కొంతమందికి నేడు(గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సచివాలయం వెనుక జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. మిగిలిన వారికి జిల్లాల విద్యా శాఖాధికారులు పత్రాలు అందిస్తారు.