AP: ‘దిత్వా’ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, తిరుమలలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. తిరుపతితో పాటు నెల్లూరు, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటు ఉత్తరాంధ్రలో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్‌లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ముందస్తు సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.