ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. టెక్కలి నుంచి పలాసకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆగి ఉన్న కారును మాధురి కారు ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.