పదవ తరగతి ఫలితాల్లో 567 మార్కులతో మెరిసిన దివ్యాంగ బాలిక

AP: నంద్యాల జిల్లాకు చెందిన కృష్ణవేణి అనే దివ్యాంగ బాలిక పదవ తరగతి పరీక్షల్లో 567 మార్కులతో ఉత్తీర్ణత సాధించి అందరినీ ఆకట్టుకుంది. ఆమె తండ్రి, సోదరి కూడా దివ్యాంగులే. పరీక్షలకు ముందు తల్లి అనారోగ్యానికి గురైనా, వైకల్యాన్ని, పేదరికాన్ని అధిగమించి కృష్ణవేణి ఈ విజయం సాధించింది. ప్రభుత్వం లేదా దాతల సహాయంతో IITలో చదువుకుని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడమే తన లక్ష్యమని ఆమె తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్