వైఎస్‌ఆర్ జిల్లా బద్వేల్‌లో శనివారం అమానుష ఘటన చోటు చేసుకుంది. రోగి బంధువులపై ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు దాడి చేయించాడు. మొదట హెల్త్ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం చేస్తానని చెప్పి.. తర్వాత ఆపరేషన్‌కు రూ.16 వేలు చెల్లించాలని డాక్టర్ అడిగాడు. ఉచిత ఆపరేషన్ అని చెప్పి డబ్బులు ఎందుకు అని రోగి బంధువులు ప్రశ్నించారు. దీంతో నన్నే ప్రశ్నిస్తారా అంటూ వారిపై డాక్టర్ దాడి చేయించాడు.