వైద్యుల నిర్లక్ష్యం.. బాలింత మృతి

AP: వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలింత మృతి చెందింది. ఈ విషాద ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. జాజులబంద గ్రామానికి చెందిన మర్రి కావ్య (25) నెల రోజుల బాలింత. కొద్ది రోజులుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. ఇటీవలే భర్త కామేశ్వరరావు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు సెలైన్ బాటిల్ పెట్టి, కొన్ని మాత్రలు ఇచ్చి పంపారు. ఇంటికి వచ్చిన కావ్యకు మళ్లీ కడుపునొప్పి వచ్చింది. ఆస్పత్రికి తరలించడం కష్టమవ్వడంతో వైద్యం అందక మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్