AP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా డాక్టర్లు మాజీ సీఎం జగన్‌ను మంగళవారం కలిశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం నిలిచిపోయిందని, దీనివల్ల పేదలు నాణ్యమైన వైద్యానికి దూరమవుతున్నారని ఫిర్యాదు చేశారు. వేలాది మంది పేద రోగులు చికిత్స పొందలేకపోతున్నారని, ఆస్పత్రులకు మంజూరు చేసే ఎల్వోసీలు పారదర్శకంగా లేవని, అధికార పార్టీకి అనుకూల ఆస్పత్రికే ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్లు ఆరోపించారు. ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం బాధాకరమని జగన్ అన్నారు.