AP: అల్లూరి జిల్లా, ఏజెన్సీలో రోడ్డు, డాక్టర్, అంబులెన్స్ సౌకర్యాలు లేకపోవడంతో గర్భిణీ స్త్రీలను డోలీలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. తడకపల్లి గ్రామంలో నెలలు నిండిన గర్భిణీని సుమారు 7 కిలోమీటర్ల మేర డోలీలో తరలించారు. భారీ వర్షంలోనూ ఈ ప్రయాణం కొనసాగింది. అడవి బిడ్డలు అంబులెన్స్ రాకపోవడంతో డోలీ మోతనే నమ్ముకున్నారు.