AP: మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఆదివారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్యోగాలు పొందడానికి తాము పడిన కష్టాలను వివరించారు. తమపై అనవసర నిందలు మోపి, రాజకీయ స్వార్థం కోసం తమ జీవితాలను బలి చేయవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. తమ క్రీడా, విద్యా వివరాలు ఆన్‌లైన్‌లో ఉన్నాయని, ఎవరైనా పరిశీలించవచ్చని తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నామని, టెట్ రాయకుండా ఎవరికీ ఉద్యోగాలు రాలేదని స్పష్టం చేశారు. వాస్తవాలకు విరుద్ధంగా తమపై బురద జల్లుతున్నారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.