AP: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో హోంమంత్రి అనిత ప్రజలను అప్రమత్తంగా ఉండమని విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ఆమె సూచించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం హెలిప్యాడ్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. అదనంగా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి నేవీ హెలికాప్టర్లు రప్పిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా కాకినాడలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండటంతో విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు.