AP: పంచాయతీరాజ్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మరో 158 ఆవాసాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించబోతున్నట్లు ప్రకటించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ.422.10 కోట్ల నిధులతో ఈ పనులను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 347 కిలోమీటర్ల పొడవునా 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ రోడ్ల నిర్మాణంలో ఎక్కడా రాజీ పడొద్దని ఆదేశించారు.