AP: రైతాంగానికి, ఆక్వా, ఇతర అత్యవసర వినియోగాలకు డీజిల్, పెట్రోలు కొరత లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆయన సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో బంకుల్లో డీజిల్, పెట్రోల్ కొరతపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృత్రిమ కొరతను అదునుగా తీసుకొని పెట్రోల్ డీజిల్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల అనంతరం పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతాయని సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు నమ్మవద్దని సూచించారు.