AP: రాష్ట్రంలో డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతోందని, కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయని ఎమ్మెల్సీ, వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆరోపించారు. హోంమంత్రి నివాసం ఉంటున్న విశాఖలోనే కాలేజీలో డ్రగ్స్ దొరికాయని, డ్రగ్స్ కేసులో తెలుగుదేశం నేతలే ఉన్నారంటూ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఎన్ని అఘాయిత్యాలు చేసిన, తప్పుడు పనులు చేసినా శిక్షలు ఉండవని తెలిసే దుర్మార్గులు విజృంభిస్తున్నారంటూ పేర్కొన్నారు.