రాజకీయ నేతలకు రెట్టింపు జరిమానాలు విధించండి: మంత్రి అనిత

అనకాపల్లి జిల్లాలో ‘సురక్షిత రోడ్లు- సురక్షిత జీవితం, మీ భద్రత- మా బాధ్యత’ నినాదంతో జరిగిన హెల్మెట్ అవగాహన కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని, రాజకీయ నాయకులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే రెట్టింపు జరిమానా విధించాలని పోలీసులకు ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆమె నొక్కి చెప్పారు.

సంబంధిత పోస్ట్