AP: ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడి ఎంపీటీసీ సిగ్మెంట్ 3లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిలిచిపోయింది. బ్యాలెట్ పేపర్లపై పీవో సంతకాలు లేకపోవడం, బ్యాలెట్ బాక్స్ తెరిచి ఉండటం వంటి అంశాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీవో సంతకంపై ఉన్న సందేహాల నేపథ్యంలో, కౌంటింగ్ కేంద్రం నుంచి ఏజెంట్లను బయటకు వెళ్లాలని ఆర్వో సూచించడంతో వివాదం నెలకొంది.