సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సిట్ రిపోర్టుపై అనుమానాలు

AP: విజయవాడకు చెందిన సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో సిట్‌ సమర్పించిన రిమాండ్‌ రిపోర్టుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్‌ చెప్పిన వివరాల ప్రకారం.. మే 7న పోలీస్‌స్టేషన్‌లో సాయికృష్ణను కొట్టారని, మే 12న పాడుబడిన భవనంలో చావుబతుకుల్లో ఉన్న అతడిని చూశానని పేర్కొన్నట్లు సిట్‌ తెలిపింది. అనంతరం మృతదేహాన్ని స్వర్గపురి శ్మశానవాటికలో దహనం చేసినట్లు వివరించింది. అయితే గతంలో పోలీస్‌స్టేషన్‌లోనే బూడిద, ఎముకలు లభించాయని చెప్పడం సహా పలు అంశాలపై సందేహాలు తలెత్తుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕