AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జంతలూరులో జరగనున్న ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా, పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.