AP: అక్టోబర్ 5న మద్యం షాపులకు డ్రా తీసి దుకాణాలు కేటాయిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఎవరైనా మద్యం షాపు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. శనివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. డిస్టలరీల నుంచి మద్యం షాపు వరకు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా మద్యం బాటిల్‌ను స్కాన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.