రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద డ్రోన్ కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు జైలు సమీపంలోని అపార్ట్‌మెంట్ నుంచి డ్రోన్ ఎగరేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అదే జైలులో ఎంపీ మిథున్‌రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉండటంతో ఈ ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగరేసిన వారి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.