నడిరోడ్డుపై బీరు బాటిల్‌తో మందుబాబు వీరంగం (వీడియో)

AP: నడిరోడ్డుపై బీరు బాటిల్‌తో మందుబాబు వీరంగం సృష్టించాడు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని బంగ్లా సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే రహదారిపై మందుబాబు హల్‌చల్ చేశాడు. బీరు బాటిల్‌ను పగులగొట్టి, గాజు ముక్కను చేతిలో పట్టుకుని వచ్చీపోయే వాహనాలను ఆపాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను ఆపి బెదిరించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్