AP: మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని, చేతనైతే ఆపాలని జగన్కు సవాల్ విసిరారు. తమ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో సుమారు 30 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీకి మధ్య తేడా కూడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు.