ఏపీలో అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండో విడత నిధులను అక్టోబర్ 17న జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రెండో విడతలో ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 వేల చొప్పున అందనుంది. ఇందులో పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేలు చెల్లించనుంది. తొలి విడతలో 46.85 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,125.47 కోట్ల సాయం అందించారు.