ఈ (2024-25) ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు రూ.2వేల కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని సెర్ప్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 1.35 లక్షల మందికి రూ.లక్ష మేర, 15 వేల మందికి రూ.5 లక్షల రుణాలను అందించనున్నారు. లబ్ధిదారుల ఆసక్తి, యూనిట్ ఏర్పాటు వ్యయానికి అనుగుణంగా రుణాన్ని భవిష్యత్తులో రూ.10 లక్షలకు కూడా పెంచుతామని పేర్కొంటున్నారు.