వర్షాలకు కూలిన భారీ వృక్షం

తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఎర్రకాలువ వంతెన సమీపంలో పొలమూరు వెళ్లే రోడ్డులో భారీ వృక్షం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, గాలులకు రోడ్డుపై కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ చెట్టు కింద చిల్లర వ్యాపారులు అనేకమంది పండ్లు, మొక్కజొన్న, కొబ్బరి నీళ్లు అమ్ముకునేవారు. విషయం తెలుసుకున్న అధికారులు చెట్టు తొలగించే చర్యలు చేపట్టారు. చెట్టు రోడ్డుపై కూలినప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాలు ఉండటంతో వాహనదారులకు పెద్దగా ఇబ్బంది కలగలేదు.

సంబంధిత పోస్ట్

✕
✕