చిత్తూరులో ప్రత్యేక ఓటర్ల సమ్మేళనం!

చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయంలో బుధవారం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) జిల్లా సమన్వయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే, ప్రత్యేక సవరణ రాష్ట్ర కన్వీనర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బూత్ స్థాయి ప్రతినిధుల విధివిధానాలపై చర్చించి, ఓట్ల నమోదు, తొలగింపు ప్రక్రియల్లో బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జోన్ కన్వీనర్ మధుసూధన్, జిల్లా బీజేపీ అధ్యక్షులు సూరపనేని జగదీశ్వర నాయుడు, జిల్లా కన్వీనర్ అట్లూరి శ్రీనివాస్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్