అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు ఎంపీడీవో కార్యాలయంలో 'సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్' కార్యక్రమంలో పాల్గొన్నారు. జీఎస్టీ 2.0 విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. గతంలో నాలుగు శ్లాబులు ఉండగా, ఇప్పుడు రెండు శ్లాబుల విధానాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.