దేవరపల్లి బస్టాండ్ వద్ద మంగళవారం రాత్రి కుక్కల బెడద తీవ్రమైందని, 20కి పైగా కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయని, ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రధాన రహదారిపై ఇవి ద్విచక్ర వాహన ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కుక్కలను జనావాసాలు లేని ప్రదేశాలకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు.