దుద్దుకూరులో విద్యా కమిటీ ఎన్నిక

గోపాలపురం మండలం దుద్దుకూరులోని శ్రీ రంగరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విద్యా కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మల్లిపూడి వెంకట్రావు విద్యా కమిటీ చైర్మన్‌గా, పఠాన్ షాకీర్ వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన సభ్యులను హెచ్ఎం వీర్రాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕