గోపాలపురంలో భారీ వర్షాల కారణంగా దుద్దుకూరులో వరద నీరు ఏలూరు జాతీయ రహదారిపైకి చేరింది. ఆంజనేయ విగ్రహం-బస్టాండ్ సెంటర్ వద్ద డ్రైనేజీ వ్యవస్థలో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలుగు రైతు అధ్యక్షులు ముళ్లపూడి దొరాజి చౌదరి, సెక్రటరీ రామచంద్రరావు గురువారం జేసీబీ సహాయంతో నీటిని తొలగించి, రాకపోకలను పునరుద్ధరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.