తూగో జిల్లా దేవరపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద సోమవారం మాజీ హోంమంత్రి తానేటి వనిత నిరసన తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక కల్తీ మద్యం పెరిగిపోయిందని, వీధికి 10 నుండి 15 బెల్ట్ షాపులు వెలిశాయని, ఈ హయాంలో మద్యం ఏరులై పారుతోందని ఆమె ఆరోపించారు. కల్తీ మద్యం అరికట్టాలని ఎక్సైజ్ సీఐకి తానేటి వనిత వినతి పత్రం అందించారు.