దేవరపల్లి బస్టాండ్ వద్ద మంగళవారం రాత్రి కుక్కల బెడద తీవ్రమైందని, 20కి పైగా కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ప్రధాన రహదారిపై అడ్డుపడి ద్విచక్ర వాహన ప్రమాదాలకు కారణమవుతున్నాయని, అధికారులు స్పందించి కుక్కలను జనావాసాలు లేని ప్రదేశాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.