వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా తక్షణ చర్యలు

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం ధుమంతునిగూడెం గ్రామంలో వర్షాల కారణంగా నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యను జనసేన పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి అయినాల నరసింహమూర్తి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కూటమి నాయకులు గ్రామానికి చేరుకుని జేసీబీ సహాయంతో కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా కాలువల్లో పూడికతీత పనులు చేపట్టారు. దీంతో నీరు నిలిచిపోయే సమస్యకు పరిష్కారం లభించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕