నిరుపేద పిల్లలతో జనసేన నాయకుల దీపావళి వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల లోని ఆనంద నిలయంలో నిరుపేద పిల్లలతో జనసేన నాయకులు అయ్యవరం జనసేన నాయకులు గుడిసె శివరామకృష్ణ, పెనుమాక కిషోర్ బాబు, కటారి సాయి తేజ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేద పిల్లలకు దీపావళి సామాగ్రిని అందించారు. నల్లజర్ల సొసైటీ డైరెక్టర్ గుడిసె శివరామకృష్ణ మాట్లాడుతూ, నిరుపేద పిల్లల కళ్ళల్లో ఆనందం చూడటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్