దేవరపల్లిలోని సెయింట్ జాన్ లూథరన్ దేవాలయంలో రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్త్రీల మైత్రి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సైజు చదలవాడ శైలజ “ధన్యత” అనే అంశంపై బైబిల్లోని ప్రవచనాలను ఉటంకిస్తూ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. ధన్యత, విశ్వాసం, ప్రేమ, సేవా భావాలతో జీవనం సాగించాలని ఆమె సూచించారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.