దేవరపల్లి గ్రామంలోని ఎస్సీ ఏరియా కమ్యూనిటీ హాల్ మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన కోసం రూ. 5 లక్షలు, స్మశానవాటికలో షెడ్డు నిర్మాణం కోసం రూ. 3 లక్షల నిధుల మంజూరు ఉత్తర్వుల కాపీలను మండల పరిషత్ అధ్యక్షుడు కేవీకే దుర్గారావు సంఘ నాయకులకు అందజేశారు. తన పదవీకాలంలో మండల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సుమారు రూ. 12 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎంపీపీ తెలిపారు. ఎస్సీ ఏరియా అభివృద్ధికి సహకరించిన ఎంపీపీకి సంఘ నాయకులు రాపాక అబ్బులు, ప్రత్తిపాటి వెంకటరావు, కోడి సూరీ లు కృతజ్ఞతలు తెలిపారు.