గోపాలపురం మండలం వాదాలకుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గెడా జగ్గారావు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ తానేటి వనిత ఆదివారం వాదాలకుంటకు వెళ్లి జగ్గారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జగ్గారావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.