నియోజకవర్గ యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులను తగ్గించేందుకు స్థానికంగా పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఒక పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.